MAD Square - Teaser : మ్యాడ్ స్క్వేర్ టీజర్.. నవ్వులూ రెట్టింపే

Update: 2025-02-25 11:00 GMT

మ్యాడ్.. 2023లో చిన్న సినిమాగా వచ్చి హిలేరియస్ గా నవ్వించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియ, అనంతిక, గోపిక, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా బూతులు లేకుండా క్లీన్ గా నవ్వించిందీ సినిమా. ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ అనౌన్స్ అయినప్పుడు అన్ని నవ్వులు రిపీట్ అవుతాయా అనుకున్నారు చాలామంది. బట్ లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ చూస్తే ఈ సారి నవ్వులు కూడా డబుల్ అవుతాయి అన్నట్టుగానే ఉంది. టీజర్ తోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపించేశారు.

ఫస్ట్ పార్ట్ లో స్టోరీని నెరేట్ చేసిన లడ్డూ ఈ సారి పెళ్లి కొడుకవుతాడు. సరిగ్గా అతని పెళ్లి టైమ్ దగ్గరకి వచ్చినప్పుడు దుర్ముహూర్తంలా మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారు. అతన్ని బలవంతంగా గోవా తీసుకువెళతారు. అక్కడి నుంచి ఫన్ రైడ్ మొదలవుతుంది. రకరకాల మలుపులు తిరుగుతూ ప్రతి మలుపులోనూ లెక్కలేనన్ని నవ్వులు పంచుతాం అన్నట్టుగా ఉంది. ఈ సారి హీరోయిన్లు పెద్దగా కనిపించలేదు కానీ.. ఈ నలుగురే రఫ్ఫాడించబోతున్నారని అర్థం అవుతోంది. టీజర్ చివర్లో వారికో ఫోన్ వస్తుంది. ఎవరు మాట్లాడేది అంటే.. అవతలి వైపు నుంచి బేస్ వాయిస్ తో ‘భాయ్’ అంటాడు. దీనికి వీళ్లు.. ఓకే బాయ్ అనేస్తారు. సో.. సినిమాలో ఇలాంటివి చాలానే ఉండబోతున్నాయనుకోవచ్చు.

ఇక మార్చి 29న విడుదల కాబోతోన్న ఈ మూవీని కూడా సితార బ్యానర్ లోనే నిర్మించారు. ఈ సారి అబ్బాయిలంతా వాళ్లే కనిపిస్తున్నారు. అన్నట్టు అనుదీప్ కూడా ఒక షాట్ లో ఉన్నాడు. మరి సినిమాలోనూ ఇంతే ఉంటాడా లేక ఇంకేదైనా సీన్ వరకూ ఉంటాడా అనేది చూడాలి. మొత్తంగా మ్యాడ్ స్క్వేర్ తో ఈ సారి నవ్వులు కూడా రెట్టింపుగా ఉంటాయని ఈ టీజర్ తో చెప్పకనే చెప్పారు.

Full View

Tags:    

Similar News