Made In Heaven 2: ఆగస్టు 10 నుంచి అమెజాన్ లో...
అమెజాన్ స్ట్రీమింగ్ కానున్న 'మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2';
ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న 'మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2' ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 11నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని శోభితా ధూళిపాళ్లతో పాటు సినిమాలోని మరికొందరు స్టార్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో పాటు సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా షేర్ చేశారు.
పోస్టర్‌లో శోభిత, అర్జున్ మాథుర్, జిమ్ సర్భ్, మోనా సింగ్, కల్కీ కోచ్లిన్, శశాంక్ అరోరా,త్రినేత్ర వంటి సినిమాలోని ప్రధాన నటులు నేరుగా కెమెరా వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ ను షేర్ చేసిన శోభిత.. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ క్యాప్షన్ ను కూడా జోడించింది. "దీన్ని అధికారికంగా విడుదల చేస్తున్నాం. చివరకు! మేడ్ ఇన్ హెవెన్ టీమ్ మళ్లీ షాదీ బిజినెస్ లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది" అంటూ రాసుకొచ్చింది. ఇక ఇదే విషయంపై ప్రైమ్ వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ను పంచుకుంది. "కాలం మారుతుంది, వివాహాలు గొప్పగా మారుతాయి, మేడ్ ఇన్ హెవెన్ తిరిగి వస్తోంది! #MadeInHeavenOnPrime S2, ఆగస్ట్ 10" అని క్యాప్షన్ లో జోడించింది.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. "నేను చూడటం కోసమే 10వ తేదీన సెలవు తీసుకుంటున్నాను" అని ఒక యూజర్ తెలపగా.. "చివరిగా!!!!!! నా పుట్టినరోజు బహుమతిగా అనుకుంటున్నాను" అంటూ మరొకరు చెప్పారు. "ఫైనల్లీ.. చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను" మరొక నెటిజన్ అన్నాడు. ఎమ్మీ-నామినేట్ చేసిన ఈ డ్రామా రెండవ సీజన్‌ను చూడటానికి అభిమానులు చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటూ ఇంకొందరు రాసుకొచ్చారు.
విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ రొమాంటిక్ వెబ్ డ్రామా సిరీస్ మొదటి సీజన్ మార్చి 8, 2019న విడుదలైంది. ఇది 45-60 నిమిషాల రన్-టైమ్‌తో 9 ఎపిసోడ్‌లను ప్రీమియర్ చేసింది. ఎక్సెల్ మీడియా,టైగర్ బేబీ ఈ సీజన్ ను నిర్మించారు. మేడ్ ఇన్ హెవెన్ 2లో శోభిత, అర్జున్, కల్కి కోచ్లిన్ , జిమ్ సర్భ్, శశాంక్ అరోరా, శివాంగి రస్తోగి - మరియు ఇష్వాక్ సింగ్. త్రినేత్ర వంటి కొన్ని కొత్త ముఖాలు ఈ సీజన్ లో అలరించనున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, చిత్రనిర్మాత జోయా అఖ్తర్ ఈ సీజన్ 1 ను రూపొందించారు. ఇందులో 9 ఎపిసోడ్ లు ఉండగా.. ఇప్పుడు ౭ ఎపిసోడ్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ చిత్రీకరణ మార్చి 2, 2021న ప్రారంభమై.. జూలై 2021లో ముగిసింది, అయితే కోవిడ్-19 కారణంగా షూట్‌లో అవకతవకలు ఉన్నందున ముందు అనుకున్నట్లుగా జరగలేదు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీజన్‌కు శోభిత ఇటీవలే డబ్బింగ్ చెప్పడం కంప్లీట్ చేసింది. అయితే మొదటి సీజన్‌కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నాయర్ ఈ రెండవ సీజన్‌లో ఉండరు, బదులుగా రీమా కగ్టి దర్శకురాలిగా చేరనుంది.