Madee Manepalli : మిరాయ్ లో ఆ నటుడు భలే చేశాడే..

Update: 2025-09-15 08:34 GMT

ప్రతి ఫ్రైడే సినిమా ఎవరో ఒకరిని హైలెట్ చేస్తుంది. ఆ వారం ఎవరికి అదృష్టం ఉంది అనేది ఎవరికీ తెలియదు. కొందరు అద్భుతంగా చేసినా అదృష్టం కలిసి రాకపోతే ఇండస్ట్రీలో దృష్టిలో పడరు. బట్ అతి తక్కువ మూవీస్ తోనే తనదైన ముద్రను బలంగా వేస్తూ దూసుకుపోతున్న ఈ నటుడు మిరాయ్ మూవీలో ‘మ్యాప్’అనే పాత్రతో ఒక్కసారిగా షైన్ అయ్యాడు. తేజ సజ్జా ఫ్రెండ్ గా గెటప్ శ్రీనుతో కలిసి సినిమా ఆసాతం కనిపిస్తూ ఆకట్టుకున్న ఆ నటుడు పేరు మ్యాడీ మానేపల్లి.. అలియాస్ మధుకర్ మానేపల్లి. మ్యాడీ అనేది తన స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నాడు. ఈ చిత్రంలో అతని నటనకు మంచి మార్కుల పడుతున్నాయి. స్నేహితుడు కోసం ఎంత దూరమైన వెళ్లే మిత్రుడుగా ఆకట్టుకున్నాడు. మిరాయ్ కు ముందు రవితేజ ఈగిల్ మూవీలో మెరిసినా సినిమా హిట్ కాకపోవడంతో పెద్ద గుర్తింపు రాలేదు. ఇప్పుడు మిరాయ్ బ్లాక్ బస్టర్ కావడంతో అతని గురించి ఆరాలు తీస్తున్నారు.

మధుకర్ గుంటూరు నుంచి వచ్చాడు. అతని తండ్రి డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్, యాక్టర్. ఆయన స్ఫూర్తితోనే నటుడు కావాలని పరిశ్రమకు వచ్చాడట. మొదట అవకాశాలు రాకపోవడంతో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. ఎడిటర్ గా కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు. ఆ టైమ్ లోనే అతనికి సినిమాటోగ్రాఫర్ కమ్ మిరాయ్ డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని తో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. కార్తీక్ అతనికి ఈగిల్ మూవీలో అవకాశం ఇచ్చాడు. ప్రూవ్ చేసుకున్నాడు. అంతకు ముందు సవారీ సినిమాలో ఓ మంచి పాత్రతో ఆకట్టుకున్నాడు. ఈగిల్ ఇచ్చిన గుర్తింపు తో చౌర్యపాఠంలో ఒక లీడ్ పాత్ర దక్కింది. ఇప్పుడు మిరాయ్ తో ఇండస్ట్రీ మొత్తానికీ తెలిసిపోయాడు. తనకు స్టీరియో టైప్ రోల్స్ అంటే ఇష్టం ఉండదని.. వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటున్నా అని చెబుతున్నాడు. పాపం పసివాడు అనే వెబ్ సిరీస్ తో పాటు డిటెక్టివ్ కార్తీక్ అతని ఇతర వర్క్స్. త్వరలోనే మారియో అనే మూవీలో ఓ కీలక పాత్రతో రాబోతున్నాడు.

చూడగానే ఆకట్టుకునే ఆహార్యం మ్యాడీ సొంతం. అదే అతన్ని యూనిక్ గా నిలుపుతోంది. మరి ఈ మిరాయ్ ఇచ్చిన గుర్తింపుతో ఇండస్ట్రీలో తనదైన ముద్రను మరింత బలంగా వేస్తాడేమో చూడాలి.

Full View

Tags:    

Similar News