Guruswamy : 'మహర్షి' రైతు 'గురుస్వామి' ఇక లేరు..
Guruswamy : టాలీవుడ్‌లో రైతు పాత్ర అనగానే గుర్తుకు వచ్చేది నటుడు గురుస్వామి;
Guruswamy : టాలీవుడ్‌లో రైతు పాత్ర అనగానే గుర్తుకు వచ్చేది నటుడు గురుస్వామి. ఆయన పేరు అంత పాపులర్ కానప్పటికీ చూస్తే ఏ తెలుగు ప్రేక్షకుడైనా గుర్తుపట్టాల్సిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఈ రోజు కన్నుమూశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర మనస్తాపం వ్యక్తం చేస్తున్నారు. మహర్షి సినిమాలో రైతు పాత్రతో మంచి గుర్తింపును సాధించుకున్నారు గురుస్వామి.
గురుస్వామి సినిమాల్లోకి రాకముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా చేసారు. తరువాత నాటక రంగంలో చేరి విజేత ఆర్ట్స్ సంస్థను స్థాపించారు. ఆర్థిక సమస్యల వల్ల ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేశారు. మహర్షి సినిమాలో రైతు పాత్రతో ఆయనుకు ఎనలేని గుర్తింపు వచ్చింది.