Mahesh Babu: అమ్మకు ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఒక రోజు నిజంగా సరిపోదు.. : మహేష్ బాబు ట్వీట్

Mahesh Babu: నువ్వు నాకు ఎప్పుడూ ఆశీర్వచనమై ఉంటావు.. నిన్ను ప్రేమించడానికి ఒక్కరోజు నిజంగా సరిపోదు.. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.

Update: 2022-04-20 09:00 GMT

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందజేశారు. నా ప్రియమైన అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నువ్వు నాకు ఎప్పుడూ ఆశీర్వచనమై ఉంటావు.. నిన్ను ప్రేమించడానికి ఒక్కరోజు నిజంగా సరిపోదు.. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అంటూ తల్లి ఇందిర కోసం హృదయపూర్వక పోస్ట్‌ను రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తమ అభిమాన నటుడి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందిరమ్మకు తమ నమస్కారాలను తెలియజేసారు. ఆమె ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. సూపర్‌స్టార్ తన తల్లి కోసం నిజంగా అందమైన పోస్ట్‌ను వ్రాశాడని, అది అతడికి అమ్మ పట్ల తన హృదయంలో ఉన్న నిజమైన ప్రేమను చూపుతుందని పేర్కొన్నారు.

కాగా, మహేష్ బాబు ప్రస్తుతం తన రాబోయే చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇందులో కీర్తి సురేష్ హరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ రచన, దర్శకత్వం వహించారు. బ్యాంక్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన సర్కారు వారి పాట కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

Similar News