Mahesh Babu: నమ్రతతో 17ఏళ్లు.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu: మాజీ మిస్ ఇండియా అయిన నమ్రతా శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు స్వస్తి చెప్పింది.;
Mahesh Babu: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ ఈరోజు తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహేష్ బాబు.. నమ్రత, గౌతమ్, సితారతో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు- అప్పుడే 17 ఏళ్లు గడిచిపోయాయా అనిపిస్తుంది.. చాలా ఆశ్చర్యంగా ఉంది.. అని మహేష్ బాబు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ షూటింగ్ సమయంలో మొదటిసారి కలుసుకున్నారు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత, మహేష్. నమ్రతా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మాజీ మిస్ ఇండియా అయిన నమ్రతా శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు స్వస్తి చెప్పింది. ఆమె చివరిసారిగా 2004లో 'బ్రైడ్ అండ్ ప్రెజూడీస్' (హిందీ, ఇంగ్లీష్) తెలుగులో 'అంజి' సినిమాలలో కనిపించింది. మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, మహేష్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా సర్కార్ వారి పాటను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
So easily 17! Happy anniversary NSG!! Many more to us... it's all about love ♥️♥️♥️ pic.twitter.com/Lw76cY77zu
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2022