ఆల్రెడీ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు.. విజయ్ దేవరకొండకు పోటీగా ఎందుకు వస్తాడు అనుకుంటున్నారు కదూ. నిజమే.. కానీ పోటీగా వస్తున్నది కూడా నిజమే. ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది కదా.. ఆల్రెడీ మహేష్ నటించిన మురారి, ఒక్కడు, పోకిరి వంటి మూవీస్ రీ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో మరోసారి ఆయన సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం అద్భుతమైన డేట్ ను సెలెక్ట్ చేసుకున్నారు ఫ్యాన్స్. యస్.. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రాన్ని మే 30న రీ రిలీజ్ చేయబోతున్నారు.
ప్రతి యేడాదీ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటాడు. ఈ సారి రాజమౌళి మూవీ నుంచి కూడా అలా ఏదో ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఛాన్స్ ను ఫ్యాన్స్ కూడా ఉపయోగించుకోబోతున్నారు. మే 30న మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండో సినిమా ఖలేజాను రీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ అప్పట్లో జనాలకు అర్థం కాలేదు. అంటే పోకిరి, బిజినెస్ మేన్ వంటి మాస్ మూవీస్ చేస్తున్న టైమ్ కాబట్టి ఆడియన్స్ సడెన్ గా ఈ కామెడీని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే ఖలేజా థియేటర్స్ లో ఫ్లాప్ అనిపించకుంది. తర్వాత చాలామంది మోస్ట్ ఫేవరెట్ మూవీ అయింది. ఆ చిత్రం రీ రిలీజ్ అంటే ఈ సారి థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనే అనుకోవాలి.
ఇక విశేషం ఏంటంటే.. ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తోన్న విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ కూడా మే 30నే విడుదల కాబోతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సితార బ్యానర్ నిర్మిస్తోంది. విజయ్ ఇప్పటికే కాస్త డౌన్ లో ఉన్నాడు. అలాంటి అతనిపైకి మహేష్ మూవీ వేయడం అంటే ఖచ్చితంగా కింగ్ డమ్ కు ఇబ్బందులు తప్పవు అనే చెప్పాలి. కాకపోతే ఆయనెవరో అన్నట్టు రీ రిలీజ్ కు, డైరెక్ట్ రిలీజ్ పోటీ కాదు అనేది నిజమే అయితే విజయ్ గట్టెక్కుతాడు.