Malavika Satheesan: అవకాశం వస్తే ఆ హీరోతో.. : మాళవిక సతీశన్
Malavika Satheesan: అడివి శేష్.. ఓ ప్రతిభావంతుడైన నటుడు. యువ ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.;
Malavika Satheesan: అడివి శేష్.. ఓ ప్రతిభావంతుడైన నటుడు. యువ ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.అడివి శేష్‌పై తన ప్రేమను చాటుతోంది ఈ కొత్త నటి ఒకరు. ఆమెకు అతనితో వర్క్ చేయాలనుందట.
కేరళకు చెందిన నటి మాళవిక సతీశన్ ఇటీవల 'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్'తో తెరంగేట్రం చేసింది. ఇంతకు ముందు ఆమె మిస్ కేరళ 2020 ఫైనల్‌కు చేరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తుంది. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటుంది.
మీ అభిమాన హీరో ఎవరు అని ఓ కొంటె కుర్రాడు ప్రశ్నించాడు.. దానికి మాళవిక "పెద్ద లిస్టే ఉంది.. నాని సార్, రామ్ చరణ్ సార్, పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్ ఇలా చాలా మందే ఉన్నారు. అయితే అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతడంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటాయి. అలాంటి కథలంటే నాక్కూడా చాలా ఇష్టం. అవకాశం వస్తే ఆయనతో కలిసి పనిచేయాలనుంది అని వివరించింది.
మరి మాళవిక కోరికను ఆదివి శేష్ నెరవేరుస్తాడో లేదో చూడాలి. అడివి శేష్ త్వరలో 'హిట్-ది సెకండ్ కేస్'తో రాబోతున్నాడు, మాళవిక సతీశన్ రెండవ చిత్రం 'దోచెవారెవరురా' శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో వస్తోంది.