యుధ్ర సినిమాలో తన గ్లామర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మాళవిక గ్లామర్ కు స్క్రీన్ ప్రెజెన్స్ కు బాలీవుడ్ ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు కార్తీ హీరోగా వస్తున్న సర్దార్ 2 సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ సర్దార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్నారు. అయితే కోసం కెరీర్ లో మొదటిసారి సర్దార్ 2కోసం యాక్షన్ మోడ్ లో కనిపించనుందట మాళవిక. ఈమేరకు ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో మాళవిక ఒంటికి బెల్ట్స్ కట్టుకొని యాక్షన్ సీక్వెన్స్ కోసం సిద్దమవుతున్నట్లు కనిపించారు. దాంతో ఆ ఫోటో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. మరి ఇంతకాలం తన గ్లామర్ షోతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ మొదటిసారి యాక్షన్ మోడ్ లో ఏమేరకు అలరిస్తుందో చూడాలి.