Malayalam Director Siddique : గుండెపోటుతో మళయాళీ డైరెక్టర్ మృతి.. ప్రముఖుల నివాళి

మలయాళ డైరెక్టర్ సిద్దిఖీకి మృతదేహానికి సినీ ప్రముఖల నివాళులు;

Update: 2023-08-09 09:39 GMT

ప్రముఖ మలయాళ చిత్రనిర్మాత సిద్ధిఖీ.. 69 ఏళ్ల వయసులో ఆగస్టు 8న మరణించారు. ఆగష్టు 7, 2023న మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుండెపోటు రావడంతో సిద్ధిఖీ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు ప్రాణాలు వదిలారు. ఆయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.


సిద్ధిఖ్ మృతికి ప్రముఖుల సంతాపం

చిత్రనిర్మాత సిద్దిఖీకి గుండెపోటు కంటే ముందు న్యుమోనియా, కాలేయ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత అయనకు ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) మెషీన్ సపోర్టు ద్వారా వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆయన మృతి పట్ల మమ్ముట్టి ఫేస్‌బుక్‌లో సంతాపం తెలిపారు. "ఎంతో ప్రియమైన సిద్దిఖీ మరణం భరించలేని బాధను కలిగిస్తోంది... మా సిద్దిఖ్ కు నివాళి" అంటూ ఆయన ట్వీట్ చేశారు. మోహన్ లాల్ కూడా ఈ సందర్భంగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఫస్ట్ మూవీ 'కన్నుమ్నట్టు' నుండి చివరి చిత్రం 'బిగ్ బ్రదర్' వరకు అతను సహాయ దర్శకుడిగా ఉన్నారు. సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ సిద్ధిఖీ తనకు పెద్ద అన్నయ్యలాంటి వాడని ఆయన తెలిపారు.

హృదయ విదారక ఎమోజీతో హీరోయిన్ కీర్తి సురేష్ సిద్ధిఖీ చిత్రాన్ని పంచుకున్నారు. నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా సిద్ధిఖీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. వీరితో పాటు ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ నజ్రియా, అతుల్ అగ్నిహోత్రి లాంటి పలువురు ప్రముఖులు సిద్ధిఖీ మరణంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన కుటుంబానికి సానూభూతి వ్యక్తం చేశారు. సిద్ధిఖీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పోస్టులు పెట్టారు.


సిద్దిక్ కెరీర్ గ్రాఫ్

1989లో 'రామ్‌జీ రావు స్పీకింగ్' అనే మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధిఖీ... ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 1986లో 'పప్పన్ ప్రియపెట్ట పప్పన్'తో దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు సిద్ధిఖ్. ఇటీవలి కాలంలో ఆయన చేసిన చిత్రం 'బిగ్ బ్రదర్'.

Tags:    

Similar News