Malvi Malhotra : మాల్వీ మల్హోత్రా సూపర్ ఫొటోస్ .. క్యాప్షన్ ప్లీజ్

Update: 2025-08-06 14:46 GMT

‘తిరగబడర సామీ’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మాల్వీ మల్హోత్రా.. ఆ సినిమాలో హీరోయిన్ గా కన్నా వ్యక్తిగత జీవితం, రాజ్ తరుణ్, లావణ్య వివాదంతో బాగా పాపులర్ అయింది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళ సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియాలు, పలు టీవీ సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. అందం, అభినయంతో కుర్రకారు మనసును దోచేసింది. అయితే మూవీ చాన్స్ లు రాకపో వడంతో ఈ అమ్మడు కొద్దిరోజులుగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. మంచి అవకాశాల కోసం చూస్తున్న మాల్వీ.. ఫ్యాన్స్ మాత్రం టచ్లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టుతో అందాలు ఆరబోసింది. తన క్యూట్ లుక్స్ తో అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఈ పిక్స్కు 'క్యాప్షన్ ప్లీజ్' అంటూ సలహా కోరింది. ఇక వీటిని చేసిన ఫ్యాన్స్ మాల్వీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సూపర్బ్, లుక్ బ్యూటీ ఫుల్, స్టన్నింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుత ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

Tags:    

Similar News