Manchu Manoj : గజపతి వర్మ గా మంచు మనోజ్

Update: 2024-11-12 12:15 GMT

నాంది మూవీ ఫేం విజయ్ కనకమేడల "భైరవం" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ హిట్ గరుడన్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌, నారా రోహిత్, మంచు మనోజ్‌ లీడ్ రోల్స్‌లో చేస్తున్నారు. ఇంటెన్స్ కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. "గజపతి వర్మ"గా మాస్‌ ఫీస్ట్‌లా మనోజ్‌ పాత్ర ఉండబోతుందని చెప్పకనే చెబుతున్నాడు మేకర్స్. ఈ లుక్ కూడా ఆడియన్స్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మూడు లుక్స్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో భైరవం సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News