Manchu Manoj : వాటమ్మా, వాటీజ్ దిస్ అమ్మా.. మంచు మనోజ్ సెటైర్..!
Manchu Manoj : ఈసారి మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా నడిచాయో అందరికీ తెలిసిందే.. ఎన్నికల ముందు నువ్వా నేనా అంటూ ఒకరి ప్యానల్ పైన మరొకరు విమర్శలు చేసుకున్నారు.;
Manchu Manoj : ఈసారి మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా నడిచాయో అందరికీ తెలిసిందే.. ఎన్నికల ముందు నువ్వా నేనా అంటూ ఒకరి ప్యానల్ పైన మరొకరు విమర్శలు చేసుకున్నారు. కానీ ఎన్నికల రోజు మాత్రం ఎన్నికల వరకే ఈ వివాదాలని.. ఆ తర్వాత మేమంతా ఒక్కటే అని చాటి చెప్పారు. రెండు ప్యానెల్స్ మధ్య తలెత్తిన పలు వివాదాలను ముందుగా మోహన్‌బాబు సద్దుమణిగేలా చేశారు.
ప్రకాష్ రాజ్‌ని ఆలింగనం చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ కూడా మోహన్ బాబు ఆశీస్సులు తీసుకున్నారు. అటు నటీనటులు కూడా.. మాదంతా ఒకే కుటుంబం.. మేమంతా కళాకారులం.. ఇలాంటి మాటలు, సమస్యలు మాకేమీ కొత్తకాదంటూ మా ఎన్నికల సందర్భంగా చెప్పుకొచ్చారు. మొత్తానికి అక్కడ ఫ్రెండ్లీ వాతావరణం కనిపించింది.
ఇక మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఎన్నికలు జరుగుతున్న టైంలో చాలా కూల్ గా ఉన్నారు. ఒకరిపైన ఒకరు చేతులు వేసుకొని మాట్లాడుకున్నారు. ప్రకాశ్ రాజ్‌తో మంచు విష్ణు సెల్ఫీ తీసుకున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి మేమంతా ఒక్కటే అని చెప్పాడు. ఈ ఫోటో పైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.
అందులో భాగంగా విష్ణు తమ్ముడు మనోజ్.. ఈ ఫోటోపై స్పందిస్తూ... వాటమ్మా, వాటీజ్ దిస్ అమ్మా.. సరదాగా ట్వీట్ చేశాడు. మంచు మనోజ్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.