Manchu Vishnu: ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలు నాకు అందలేదు: మా అధ్యక్షుడు మంచు విష్ణు
Manchu Vishnu: ఆ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేస్తారనే విషయాన్ని తాను మీడియా ద్వారానే విన్నానని చెప్పుకొచ్చారు.;
Manchu Vishnu: ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలేవీ తనకు అందలేదన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. ఒకవేళ రాజీనామా లేఖలు వస్తే అప్పుడు స్పందిస్తానన్నారు. ఆ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేస్తారనే విషయాన్ని తాను మీడియా ద్వారానే విన్నానని చెప్పుకొచ్చారు.
ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యుల నుంచి ఇప్పటి వరకు తనకు ఎలాంటి రాజీనామా లేఖలు రాలేదన్నారు మంచు విష్ణు. సినిమా బిడ్డలం నుంచి గెలిచిన 11 మంది సభ్యులు తమ పదవులకి రాజీనామా చేశారు. మా సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐతే.. రిజైన్ లేఖలు తమకు అందలేదని విష్ణు చెప్పారు.
మా ఎన్నికల తరువాత ప్యానెల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంచు విష్ణు అసోసియేషన్ అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు మోహన్‌బాబు. మా అధ్యక్ష పదవి బాధ్యతతో కూడుకున్నదని, ఈ రెండేళ్లలో అసోసియేషన్‌ను విష్ణు ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడని చెప్పారు.
మరోవైపు మా రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మా ఎన్నికల సీసీ ఫుటేజీ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రకాశ్‌రాజ్. తాజాగా ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ స్కూల్‌కు ప్రకాశ్‌రాజ్ వెళ్లారు. సీసీ ఫుటేజీ కావాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫోన్ చేశారు. అయితే రెండుపక్షాల వారి సమక్షంలోనే సీసీ ఫుటేజ్ సేకరిస్తామని పోలీసులు తెలిపారు.
సీసీ ఫుటేజ్‌ని ప్రిజర్వ్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. మా పోలింగ్ రోజు మోహన్‌బాబు, నరేష్ సహా మరికొందరు తమపై దాడి చేశారని ప్రకాశ్‌రాజ్ ఆరోపిస్తున్నారు. దీంతో దాడికి సంబందించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో ఉన్నాయంటూ ప్రకాష్‌రాజ్ బలంగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల రోజు నాటి సీసీ ఫుటేజ్ అందించాలంటూ ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ మాత్రం సీసీ ఫుటేజ్ ఇచ్చేందుకు నిరాకరించడం హాట్ టాపిక్‌గా మారింది.