MAA President Manchu Vishnu: మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం దానిపైనే..
MAA President Manchu Vishnu: జనరల్ ఎన్నికలలాగా నడిచిన మా ఎన్నికల హడావిడి ఇంకా కొనసాగుతూనే ఉంది.;
manchu vishnu (tv5news.in)
MAA President Manchu Vishnu: జనరల్ ఎన్నికలలాగా నడిచిన మా ఎన్నికల హడావిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అధ్యక్షులుగా పోటీచేసిన ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు మెజారిటీతో గెలిచారు. ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. తనతో పాటు తనకు మద్దతుగా ఉన్న నాగబాబు, శివాజీ రాజా కూడా రాజీనామా చేశారు. మరిన్ని రాజీనామాలు జరుగుతాయని ప్రకాశ్ రాజ్ ప్రెస్ మీట్‌లో చెప్పారు.
ఒకపక్క ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో ఇలాంటివి జరుగుతన్నా.. మరోపక్క మంచు విష్ణు మా అధ్యక్షుడిగా తన ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యాడు. అధ్యక్షుడిగా తన తొలి సంతకం సీనియర్ ఆర్టిస్టులకు పించన్ అమలుపై పెట్టారు. మంచు విష్ణు ప్యానల్ సభ్యుల సమక్షంలో అధ్యక్షుడిగా తన ప్రమాణ స్వీకారం జరిగింది.