Kannappa పుష్పరాజ్ తో మంచు విష్ణు వార్
పుష్ప 2 పోస్ట్ పోన్ అయిందనుకుని అదే డేట్ లో తన కన్నప్ప సినిమాను విడుదల చేయాలనుకుంటోన్న మంచు విష్ణు.;
అల్లు అర్జున్ సినిమాపై మంచు విష్ణు కు ఎందుకు ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి అనిపిస్తోంది కదూ. నిజమే.. ఈ సృష్టిలో ఎక్కడో జరిగేది మరెక్కడో జరిగే దానిపై ప్రభావం చూపిస్తుందని సుకుమార్ అన్నట్టు.. టాలీవుడ్ లో కూడా ఎక్కడో వినిపించేది మరెక్కడో ఎవరికో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మంచు విష్ణు చేస్తున్నది కూడా అదే అంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. పుష్ప 2 ఈ యేడాది రిలీజ్ కాదు, దర్శకుడు, నిర్మాతపై అల్లు అర్జున్ అలిగాడు.. అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కదా. దీంతో చాలామంది ఇది నిజమే అనుకుంటున్నారు. కొందరు అసలు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనుకుంటున్నారు. ఇవన్నీ నిజమే అని మంచు వారబ్బాయి కూడా అనుకున్నట్టున్నాడు. అందుకే పుష్ప 2 రిలీజ్ అయ్యే టైమ్ కు తన కన్నప్ప సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. అంటే ఇప్పటి వరకూ పుష్ప 2 పై వచ్చే న్యూస్ అంతా నిజమే అని అతను ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు.. లేక నిజం కావాలని ఆశిస్తున్నాడా అనేది చెప్పలేం కానీ కన్నప్ప సినిమాను డిసెంబర్ 3వ వారంలో విడుదల చేయబోతున్నట్టు టాక్.
కాకపోతే ఇండస్ట్రీలో కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నది ఏంటంటే.. పుష్ప 2 కాస్త ఆలస్యంగా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినా.. ఈ సారి చెప్పిన డేట్ కు రావడం పక్కా అంటున్నారు. మరి అప్పుడు విష్ణు తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటాడా లేక పుష్పరాజ్ తో ఎందుకులే అని తప్పుకుంటాడా అనే డిస్కషన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. అయినా మంచు విష్ణు కేవలం తననే నమ్ముకోలేదు కదా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, కాజల్.. అబ్బో.. ఇట్టా చాలామంది నమ్ముకున్నాడు కదా.. అందుకే పుష్ప 2 తో ఢీ అన్నా ఆశ్చర్యం లేదేమో.