Maa President Manchu Vishnu: ప్రకాశ్ రాజ్ పై మా అధ్యక్షుడిగా మంచు విష్ణు భారీ విజయం..
Maa President Manchu Vishnu:మా ఎన్నికల్లో హోరాహోరీగా పోరు నడిచిందీ అంటే అది మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ల మధ్యే;
Maa Elections 2021 Results :మా ఎన్నికల్లో హోరాహోరీగా పోరు నడిచిందీ అంటే అది మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ల మధ్యే. ఇంతటి ఉత్కంఠభరితమైన పోరులోనూ మంచు విష్ణు భారీ విజయం సాధించారు. పోలింగ్ రోజున కూడా రెండు ప్యానళ్ల మధ్య వాగ్వాదాలు తప్పలేదు. చివరకు ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకుని సర్దుబాటు చేశారు. మంచు విష్ణుకు 400 పైగా ఓట్లు లభించాయి.
మంచు విష్ణు ప్యానల్ నుంచి ఎక్కువమంది గెలవడంతో ఇక మా పరిపాలన కూడా సజావుగా సాగనుంది. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అమలు చేయడం ఈ ప్యానల్ కు చాలా సులభమవుతుంది. అందుకే మంచు విష్ణు ప్యానల్ చాలా సంతోషంగా ఉంది. ముందు నుంచి తన గెలుపుపై చాలా నమ్మకంగా ఉన్నారు విష్ణు. ఇప్పుడు అదే నిజమైంది.
మంచు విష్ణు శిబిరం ఆనందంలో మునిగిపోయింది. ఈ ప్యానల్ విజయం సాధించాలని ఆయన అభిమానులంతా ఎంతగానో కోరుకున్నారు. ఇప్పుడు వారి ఆశలు ఫలించాయి. మంచు విష్ణు విజయం కోసం ఆయన తండ్రి మోహన్ బాబు ముందు నుంచి పకడ్బందీగా పావులు కదిపారు. పోల్ మేనేజ్ మెంట్ లో పక్కాగా వెళ్లారు. దీంతో విష్ణు విజయం ఇంకా సులభమైంది.