బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటి కంగనా రనౌత్ . తన అభిప్రాయాలను నిర్భయంగా బయటపెడుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటారు కంగనా. ఎవ్వరు ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా ఇటు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు కంగనా రనౌత్. అయితే 39 ఏళ్ల కంగనా ఇప్పటికీ పెళ్లి టాపిక్ మాత్రం ఎత్తడం లేదు. తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిపై తాజాగా స్పందించారు కంగనా.
"నా పెళ్లి గురించి ఇప్పటివరకు వందల వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఒకటి నిజం కాదు. అసలు నేను ఇప్పటివరకు పెళ్లి పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం. పెళ్లి వ్యవస్థపైనా నాకు పెద్దగా నమ్మకం లేదు. ఈ పెళ్లి, కుటుంబం, పిల్లలు అనే ఛాప్టర్ నా లైఫ్‌స్టైల్‌కు సరిపడవు. నాకు పెళ్లి కావట్లేదని ఎలాంటి బాధ లేదు. ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా సినిమాలు, రాజకీయాల పై ఉంది. ఈ రంగాల్లో నాకు సంతృప్తి ఉంది” అంటూ కంగనా వ్యాఖ్యానించారు. ఇక కంగనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా.. చాలామంది ఆమె స్పష్టమైన ధోరణిని మెచ్చుకుంటున్నారు.