మాస్ మహారాజ్ రవితేజ మూవీస్ లిస్ట్ పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో మూవీస్ రిజల్ట్ తో పనిలేకుండా వరుసగా మూవీస్ చేస్తున్నాడు. మరి ఈ రిజల్ట్స్ వల్ల అతని మూవీస్ పై ప్రభావం పడుతుంది కదా అనుకుంటున్నారేమో... అలా ఏం లేదు అని నిరూపించుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర మూవీతో మరో ఫ్లాప్ చూశాడు. ఈ సినిమా నుంచి ఆశించిన రిజల్ట్ రాలేదు. పైగా 75వ సినిమా కూడా. అయినా పోయింది. అయితేనేం రవితేజ దూకుడు మాత్రం తగ్గడం లేదు. మాస్ జాతర ఈ నెల 28న నెట్ ఫ్లిక్స్ లో వస్తుంది. కానీ ఆ తర్వాత రెండు సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు.
76వ సినిమా గా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే చిత్రం చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకుడు. రీసెంట్ గా టైటిల్ అనౌన్స్ చేశాడు. ఈ మూవీలో అషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. చివర్లో ఉందని కూడా చెబుతున్నారు. ఇక ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేయడం అనేది అసలు కుదరదు అని చెబుతున్నారు. ఇక ఈ మూవీ తర్వాత మరో సినిమా కూడా సిద్ధం చేస్తున్నాడు రవితేజ.
శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. ఈ మూవీ థ్రిల్లర్ జానర్ లో చేయబోతున్నాడు అని టాక్. వచ్చే యేడాది సమ్మర్ లోనే సినిమా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆ మేరకు ఈ మూవీ షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారని సమాచారం. చూస్తుంటే రవితేజ దూకుడు మామూలుగా ఉండటం లేదు అనిపిస్తోంది కదా. ఇన్ని సినిమాల షూటింగ్స్ విషయంలో మాత్రం మాస్ రాజా అస్సలు తగ్గేదే లేదు అంటున్నట్టు కనిపిస్తోంది. కాకపోతే సినిమాల సంఖ్య బాగా పెరుగుతోంది కానీ.. వాటి రిజల్ట్ మాత్రం మారడం లేదు. వస్తోన్న సినిమాలన్నీ పోతున్నాయి. కాస్త కమర్షియల్ గా కూడా ఆకట్టుకుంటే బెటరేమో అనిపిస్తోంది.