Matka Teaser : 'మట్కా' టీజర్ వచ్చేసింది

Update: 2024-10-05 16:00 GMT

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. 1958-1982 మధ్య కాలంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది మట్కా. వైజాగ్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న మట్కాలో వరుణ్ ఏకంగా నాలుగు గెటప్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. నవంబర్ 14న విడుదలకానున్న మట్కా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికి ఒక్కడే సంపాదిస్తాడు. మిగతా 10 పైసల కోసం 99 మంది కొట్టుకుంటారు" అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి వరుణ్ తేజ్ కెరీర్ లో చాలా ప్రత్యేకంగా వస్తున్న మట్కా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News