Meena : ధనుష్ తో మీనా రెండో పెళ్లి.. ? శరత్ కుమార్ ఏమన్నాడు

Update: 2024-08-02 05:49 GMT

బాల నటి నుంచి హీరోయిన్ గా మారి టాప్ ప్లేస్ లో ఓ వెలుగు వెలిగింది నటి మీనా. 2009లో విద్యా సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. వీరికి ఓ పాప. రెండేళ్ల క్రితమే విద్యా సాగర్ అనారోగ్యంతో మరణించాడు. అతను చనిపోవడానికి ముందే మీనా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దృశ్యం మూవీతో మళయాలంలో పెద్ద హిట్ అందుకుంది. అప్పటి నుంచి నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది. ప్రస్తుతం తన కూతురుతో కలిసి చెన్నైలోనే ఉంటోన్న మీనాపై సడెన్ గా ఓ కొత్త రూమర్ మొదలైంది. తన హీరో ధనుష్ ను రెండో పెళ్లి చేసుకోబోతోంది అనేదే ఆ రూమర్.

ధనుష్ 2004లో రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. అయితే ధనుష్, ఐశ్వర్య కూడా 2002లో విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరూ సింగిల్ గానే ఉంటున్నారు. అందుకే ఇప్పుడు ధనుష్, మీనా పెళ్లి అనగానే ఆ వార్త వైరల్ గా మారింది. ఇలాంటివి క్రియేట్ చేయడంలోనే ముందుండే యూ ట్యూబ్స్ అండ్ సోషల్ మీడియా ఈ వార్తను పట్టుకుని రెచ్చిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచింది వాళ్లు రాసుకున్నారు.. చెప్పుకున్నారు. అయితే ఇదంతా ట్రాష్ అంటూ మీనా కొట్టి పడేసింది. తన గురించి ఇలాంటివి స్ప్రెడ్ చేస్తున్న మీడియా పట్ల అసహనం వ్యక్తం చేస్తూ కాస్త ఘాటుగానే స్పందించింది.

అయితే మీనా విషయంలో యూ ట్యూబ్ ఛానల్స్ మరీ శృతి మించాయి అనేది అందరి ఒపీనియన్.అందుకే నటుడు శరత్ కుమార్ ఈ విషయంలో మీనా గురించి చెడుగా ప్రచారం చేసిన యూ ట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ప్రభుత్వం స్పందించి నిజంగా చర్యలు తీసుకుంటే చాలా ఛానల్స్ కు సమస్యలు తప్పవు.

నిజానికి మీనా వయసు 47యేళ్లు. ధనుష్ వయసు 41 యేళ్లు. ఈ ఇద్దరూ కలిసి నటించిందేం లేదు. అయినా ఇలాంటి పనికిమాలిన రూమర్స్ క్రియేట్ చేయడం ఏంటో కానీ.. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని డిస్ట్రబ్ చేసే హక్కు ఇంకెవడికీ లేదు.

Tags:    

Similar News