Varun Tej : మెగా హీరో మెగా ఎక్స్ప్రెస్

Update: 2024-11-07 10:15 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ దర్శకుడు మేర్లపాక గాంధీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు "మెగా ఎక్స్ప్రెస్" అనే డైనమిక్ టైటిల్ ను ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. షూటింగ్ కూడా చాలా తొందరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News