మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అయింది. నిన్న వెంకటేష్ ముఖ్య అతిథిగా ఈ మూవీ ఓపెనింగ్ లాంఛనంగా జరిగింది. అయితే ఈ ప్రారంభోత్సవాన్ని కూడా అనిల్ రావిపూడి తనదైన శైలిలో ప్రెజెంట్ చేయడం టాలీవుడ్ లో విశేషంగా మాట్లాడుకుంటున్నారు. దర్శకులు అంటే మొత్తం క్రెడిట్ మాకే అనుకునే వాళ్లే చాలామంది ఉంటారు. బట్ అనిల్ మాత్రం ఓపెనింగ్ రోజునే తన మొత్తం టీమ్ ను పరిచయం చేయడమే కాదు.. వారితో చిరంజీవి నటించిన బెస్ట్ టైమింగ్ ఉన్న మూవీస్ హోర్డింగ్స్ పెట్టించి.. వారినే మెగాస్టార్ కు తమను తాము పరిచయం చేసుకునేలా చేయడం చర్చనీయాంశం అయింది. ఓ రకంగా ఇది మూవీకి ఆల్రెడీ ప్రమోషనల్ గానూ మారింది. చివర్లో గ్యాంగ్ లీడర్ పోస్టర్ వెనక నుంచి బయటకు వచ్చిన అనిల్.. ఈ సారి సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అంటే.. అది చాలదు సౌండ్ పెంచు అంటూ తనదైన టైమింగ్ తో మెగాస్టార్ చెప్పడం ఫ్యాన్స్ లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇక ఈ టీమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, కెమెరా మెన్ సమీర్ రెడ్డితో పాటు నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదల అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ అండ్ రైటింగ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఇక తాజాగా ప్రారంభమైన చిత్రీకరణను నాన్ స్టాప్ గా చేయబోతున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అనే టాక్ ఉంది. వీరిలో ఒకరుగా అదితిరావు హైదరిని అనుకుంటున్నారు. మరో హీరోయిన్ గా భూమిక చావ్లా పేరు పరిశీలనలో ఉంది. భూమికతో ఇంతకు ముందు జై చిరంజీవాలో మెగాస్టార్ తో కలిసి నటించింది. మొత్తంగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ఆరంభంలోనే అదరగొడుతున్నాడు అనిల్.