Megastar Chiranjeevi : జాతీయ అవార్డు గ్రహితలను ప్రశంసించిన మెగాస్టార్
బన్నీకి జాతీయ అవార్డుపై గర్వంగా ఉందన్న చిరంజీవి;
69వ జాతీయ చలనచిత్ర అవార్డులను డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆగస్టు 24న ప్రకటించింది. హిందీ, తెలుగు, ఒడియా లాంటి బహుళ చలనచిత్ర పరిశ్రమలకు చెందిన పలు సినిమాలు, ప్రముఖులకు ఈ అవార్డులను దక్కాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలు ఈ సంవత్సరం ఆరు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నందుకు గానూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు.
చిరంజీవి ట్విట్టర్‌లోకి వెళ్లి విజేతలందరికీ తన ట్వీట్‌లో ట్యాగ్ చేయడం చేసి అభినందనలు తెలిపారు. "69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021 అవార్డు విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ఇది తెలుగు సినిమాకి గర్వకారణమైన క్షణం. ముఖ్యంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు నా ప్రియమైన బన్నీ.. అల్లుఅర్జున్‌కి దక్కినందుకు హృదయపూర్వక అభినందనలు.. నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను అంటూ ఆయన రాసుకువచ్చారు. దాంతో పాటు జాతీయ అవార్డులు దక్కించుకున్న సినిమాలు, ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ.. చిరు కంగ్రాజ్యులేషన్స్ చెప్పారు.
ఇదిలా ఉండగా చిరంజీవి చివరిసారిగా తమన్నా భాటియా, కీర్తి సురేష్‌తో కలిసి 'భోళా శంకర్'లో కనిపించారు. ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు. వశిష్ట దర్శకత్వంలో వంశీ, విక్రమ్, ప్రమోద్ నిర్మిస్తున్న ఫాంటసీ చిత్రంలో ఆయన నెక్ట్స్ సినిమాలో నటించనున్నారు.
Heartiest Congratulations to All The Award Winners of 69 th National Film Awards 2021 !!!! 👏👏👏
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 24, 2023
Also Proud Moment for Telugu Cinema 👏👏👏
Heartiest Congratulations to especially my dearest Bunny @AlluArjun for the coveted National Best Actor Award !!!!!
Absolutely Proud of…