Spirit Movie : ప్రభాస్ 'స్పిరిట్'లో మెగాస్టార్

Update: 2024-10-07 11:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మెగాస్టార్ మమ్ముట్టి పేరు కూడా వినిపిస్తోంది. కానీ మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక స్పిరిటి సినిమా విషయానికి వస్తే కెరీర్ లో మొదటిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. సందీప్ మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ వైల్డ్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమా దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమాను తెరకెక్కి్స్తున్నారు మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.

Tags:    

Similar News