వయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలం అని చెప్పుకునేవాళ్లంతా యేడాదికి ఒక్క సినిమా చేయడానికే నానా తంటాలు పడుతుంటే.. ఈయన ఏకంగా మూడు సినిమాలు టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆల్రెడీ విశ్వంభర మూవీ టాకీపార్ట్ పూర్తయింది. రెండు పాటలు, క్లైమాక్స్ ఫైట్ మాత్రమే బ్యాలన్స్ ఉందని చెప్పారు. అంటే ఆగస్ట్ వరకూ ఆసినిమాకు సంబంధించి మెగాస్టార్ వర్క్ కంప్లీట్ అవుతుంది. అందుకే వెంటనే మరో సినిమా సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు.
విశ్వంభర 156వ సినిమాగా వస్తోంది. 157వ సినిమాను మోహన్ రాజాతో చేయబోతున్నాడు. ఆల్రెడీ మోహన్ రాజా మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ అనే సినిమా చేసి ఉన్నాడు. మళయాల లూసీఫర్ కు రీమేక్ అయినా.. మెగా ఇమేజ్ ను బాగా వాడాడు మోహన్ రాజా. అందుకే మరోసారి అతనికి ఛాన్స్ ఇచ్చాడు చిరంజీవి. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ చెన్నైలో జరుగుతోంది. ఈ కథను బివిఎస్ రవి అందించాడు. అతనితో పాటు దర్శకుడు కూడా కూర్చుని బౌండ్ స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఒక్కసారి ఫైనల్ హియరింగ్ అయిపోతే వెంటనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు.
సో.. అదీ మేటర్.. చిరంజీవికి ఇప్పటికీ సినిమా అంటే ఎంత ప్యాషన్ అనేది మరోసారి తేలిపోయింది. విశ్వంభర సంక్రాంతికి విడుదలవుతుంది. మోహన రాజా ప్రాజెక్ట్ ను సమ్మర్ టార్గెట్ గా పెట్టుకుంటే 2025లో రెండు సినిమాలు వచ్చేస్తాయి. ఏదైనా మెగా దూకుడు మామూలుగా లేదులే.