ఆదిత్యరాయ్ కపూర్, సారా అలీఖాన్ జంటగా దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కించిన చిత్రం 'మెట్రో... ఇన్ దినో'. జులై 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ విడుదల చేశారు. నాలుగు జంటల మధ్య సంబంధాల్ని చూపిస్తూ ఆసక్తికరంగా సాగుతోందీ ట్రైలర్. ఇందులో ‘ఆధునిక ప్రేమ చాలా గందరగోళం గా ఉంటుంది. ఇది చైనీస్ షెజ్వాన్ మసాల దోశ లాంటిది' అనే సంభాషణలు సినీప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. అనుపమ్ ఖేర్, నీనా గుప్తా,అలీ ఫజల్, ఫాతిమా సనా షేక్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మించింది. పెళ్లి చేసుకొని సక్సెస్ అయిన బాలీవుడ్ జంట పేరు చెప్పాలని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నటి సారా అలీఖాన్ ను మీడియా అడగింది.ఆ ప్రశ్నతో కాస్త ఇబ్బందిపడ్డప్పటికీ, తర్వాత తేరుకొని నా తండ్రి కరీనా అని ఆమె తండ్రి సైఫ్ అలీఖాన్, అతని భార్య కరీనా కపూర్ ఖాన్ పేర్లను పేర్కొంది. వారిలో మీకు నచ్చిన గుణం ఏమిటని విలేకరి మరో ప్రశ్న అడగ్గా, ఆమె సమాధానం చెప్పేలోపే మధ్యలో జోక్యం చేసుకొన్న ఆదిత్య రాయ్ కపూర్.. నెక్స్ట్ ట్రైలర్లో సమాధానం చెబుతుందని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ నవ్వారు.