Harish Rao : ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు పాదయాత్ర చేస్తున్నారు: హరీష్‌రావు
Harish Rao : బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్రలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు మంత్రి హరీష్‌రావు..;
Harish Rao : బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్రలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు మంత్రి హరీష్‌రావు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయో చెప్పాలన్నారు.. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీయే కారణమన్నారు.. కేంద్రం ధరలు పెంచే ప్రభుత్వం అయితే.. టీఆర్‌ఎస్ పేదలకు పంచే ప్రభుత్వమని అన్నారు.. మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో హరీష్‌రావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బీజేపీపై నిప్పులు చెరిగారు.. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ వున్న బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.. దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చూసింది తప్ప ఏం చేయలేదన్నారు హరీష్‌రావు.