Telangana Municipal Elections : రేపే మున్సిపల్ పోలింగ్.. ప్రలోభాలు షురూ..!

Update: 2026-02-10 09:11 GMT

తెలంగాణలో ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో ప్రచారానికి తెర పడింది. రేపే పోలింగ్ జరగబోతోంది. ఈ ఒక్కరోజు అంతా సైలెంట్ గా ఉండబోతున్నారు. అయితే ఈ ఒక్కరోజే ఎన్నో ప్రలోభాలు, తాయిలాలు అందజేయడాలు జరుగుతాయనేది జగమెరిగిన సత్యం. కానీ అవేవీ బయటకు కనిపించవు. వినిపించవు. అదే ఎన్నికల జిమ్మిక్కు. నిన్నటి వరకు ఒక వైపు ఉన్న వారంతా.. ఈ ఒక్కరోజే మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఎన్నికల తాయిలాలతో ప్రలోభపెట్టకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.

కట్టుదిట్టమైన చర్యలతో పోలీసులు అడుగడుగునా గస్తీ కాస్తున్నారు. ఈ సారి బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య బలమైన పోటీ కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో వన్ సైడ్ మెజార్టీ వచ్చినా.. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని ఓపెన్ గానే చెప్పేశారు. దీన్ని బట్టి అన్ని పార్టీలు ఎంత బలంగా ప్రచారాలు చేశాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.

మరి అభ్యర్థులు ఈ ఒక్కరోజు ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తారో అనేదే ఇక్కడ ప్రశ్న. మున్సిపాలిటీల్లో ఎక్కువగా చదువుకున్న వారే ఉంటారు. అందులో నో డౌట్. కాబట్టి కీలకమైనా హామీలతో పాటు అభివృద్ధిపరమైన అంశాల మీద కూడా మాటలు ఇచ్చేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు. తాయిలాలు ఇస్తే సరిపోదని.. ఆయా ఏరియాల్లో ఉన్న సమస్యల మీద కూడా బలమైన హామీలు ఇస్తున్నారు. మరి ఎవరి వైపు ఓటర్లు నిలుస్తారో చూడాలి.

Tags:    

Similar News