Mirai Collections : సినిమా రేంజ్ లో కనిపించని కలెక్షన్స్

Update: 2025-09-15 07:50 GMT

ఈ మధ్య కాలంలో యూనానిమస్ గా ఓ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే అది మిరాయ్ అనే చెప్పాలి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అదే టైమ్ లో మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ఆడియన్స్ కాంప్లిమెంట్స్ తో పాటు క్రిటిక్స్ కాంప్లిమెంట్స్ కూడా సంపాదించిన ఈచిత్రం కలెక్షన్స్ విషయంలో కాస్త స్లోగా ఉందనే చెప్పాలి. అఫ్ కోర్స్ లాభాల పరంగా చూసుకుంటే ఇప్పటి వరకూ వచ్చినవి లాభాలుగానే చూడాలి. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్నారు అనే మాటలు వచ్చాయి. ముఖ్యంగా నాన్ థియేట్రికల్ గానే సినిమా భారీగా సంపాదించింది.

తేజ సజ్జా హను మాన్ తర్వాత మరోసారి సూపర్ హీరోగా చేసిన ఈ మూవీ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 81.2 కోట్లు వసూళ్లు సాధించింది. ఓ రకంగా ఈ మూవీకి వచ్చిన అప్లాజ్ ను బట్టి చూస్తే ఈ ఫిగర్స్ తక్కువ అనే చెప్పాలి. అదే టైమ్ లో వీళ్లు టికెట్ రేట్లు పెంచలేదు. పెంచమనీ అడగలేదు. అదీ ఓ కారణం. ఈ కారణంగానే ఎక్కువమంది సినిమాను చూస్తున్నారు. అయినా మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ను దాటేస్తుందని భావించారు. కానీ సాధ్యం కాలేదు. సెంచరీ కొట్టాలంటే ఈ వీక్ డేస్ లో సినిమా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. చాలామంది మిరాయ్ 300 కోట్లు పైగానే వసూలు చేస్తుందని అంచనా వేశారు. చూస్తుంటే ఆ ఫిగర్ ను చేరుకోవడం కాస్త కష్టంగానే ఉందని చెప్పాలి.

 

Tags:    

Similar News