ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ మూడో సీజన్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. జులై 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఫస్ట్ సీజన్ 2018 నవంబర్‌లో రిలీజవగా రెండో సీజన్ 2020 అక్టోబర్‌లో స్ట్రీమింగ్ అయింది. ఈ రెండు సీజన్లు అత్యధిక మంది చూసిన ఇండియన్ సిరీస్‌ల్లో టాప్ ప్లేస్‌లో నిలిచాయి.
కొన్ని రోజులుగా ఈ కొత్త సీజన్ పై ప్రైమ్ వీడియో ఊరిస్తూ వచ్చింది. సోమవారం (జూన్ 10) కూడా కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠీ) ఓ వీడియో రిలీజ్ చేసింది. మీర్జాపూర్ విషయంలో తుది నిర్ణయం నాదే.. ఈ తేదీ నేనే చెబుతాను.. అయితే కొత్త సీజన్ కోసం మరీ ఎక్కువ రోజులు వేచి చూడాల్సిందేమీ లేదు.. ఒక రోజు ఆగండి అని అతడు ఆ వీడియోలో అన్నాడు. మరి మొదటి రెండు సీజన్స్ లాగే ఈ సీజన్ కూడా భారీ విజయం సాధిస్తుందా చూడాలి.