దేవదాసు మూవీలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా. ఫస్ట్ మూవీతోనే యూత్ ను కట్టపడేసిందీ అమ్మడు. చాలా కాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్గా టాప్ హీరోలతో నటించిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. బాలీవుడ్కు వెళ్లాక అక్కడ అవకాశాలు బాగానే వస్తున్న టైంలో ఎవరితోనో ప్రేమలో పడింది. ఆ ప్రేమ బ్రేకప్ కావడంతో ఆమె కొన్నాళ్లపాటు సినిమాలకు పూర్తిగా దూరమైంది. తర్వాత రీఎంట్రీ ఇచ్చి తెలుగులో కొన్ని సినిమాలు చేసినా, ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఈ నేపథ్యంలో బాలీవు డ్లోనే బాగా స్థిరపడే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏమనుకుందో ఏమో, వివాహం చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చింది. అలాగే ఆమె మరోసారి తల్లికాబోతున్నట్టు ప్రకటించింది. ఈ కారణంగానే రైడ్ సీక్వెల్ లో చాన్స్ మిస్సయిందీ అమ్మడు. ఆమె 'రైడ్' అనే సినిమాలో మాలినీ పట్నాయక్ అనే పాత్రలో నటించింది. 2018లో రిలీజైన ఈ సినిమాకు 2025లో సీక్వెల్ వచ్చింది. ఆమె తల్లి కాబోతున్న కారణంగా, ఆమె స్థానంలో వాణీ కపూర్ ను తీసుకోవాల్సి వచ్చిం దంటున్నారు దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా. పాపం రాక రాక వచ్చిన చాన్సు అలా మిస్సయిందీ ఇల్లీ.