MOHAN LAL: సమ్మోహన నట శిఖరానికి "దాదాసాహెబ్ ఫాల్కే"

టాప్ హీరో మోహన్ లాల్ కు అరుదైన గౌరవం.. మోహన్‌లాల్‌కు "దాదాసాహెబ్ ఫాల్కే" అవార్డు... 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో అద్వితీయ పాత్రలు

Update: 2025-09-21 04:00 GMT

మల­యాళ అగ్ర హీరో మో­హ­న్ లాల్ కు అరు­దైన గౌ­ర­వం దక్కిం­ది. ఆయ­న­కు దాదా సా­హే­బ్ ఫా­ల్కే అవా­ర్డు లభిం­చిం­ది. కేం­ద్ర సమా­చార, ప్ర­సార శాఖ ఈ వి­ష­యా­న్ని శని­వా­రం సా­యం­త్రం ఎక్స్ వే­ది­క­గా ప్ర­క­టిం­చిం­ది. మో­హ­న్ లాల్ సినీ రం­గా­ని­కి చే­సిన సే­వ­ల­కు 2023 సం­వ­త్స­రా­ని­కి ఆయన దాదా సా­హే­బ్ ఫా­ల్కే అవా­ర్డు­కు ఎం­పి­క­యి­న­ట్టు వి­వ­రిం­చిం­ది. సినీ రం­గం­లో మో­హ­న్ లాల్ నటు­డు­గా, ని­ర్మా­త­గా, డై­రె­క్ట­ర్ గా ఎన్నో సే­వ­లు అం­దిం­చా­ర­ని.. ఆయన సే­వ­లు సినీ రంగ చర­త్రి­లో సు­వ­ర్ణా­క్ష­రా­ల­తో లి­ఖిం­చ­ద­గ్గ­వ­ని ఎక్స్ లో రా­సు­కొ­చ్చిం­ది. తా­జా­గా దా­దా­సా­హె­బ్ ఫా­ల్కే అవా­ర్డు ఎం­పిక కమి­టీ సి­ఫా­ర్సు మే­ర­కు మో­హ­న్‌­లా­ల్‌­కు ప్ర­తి­ష్టా­త్మ­క­మైన దా­దా­సా­హె­బ్ ఫా­ల్కే అవా­ర్డు 2023ని ప్ర­దా­నం చే­య­ను­న్న­ట్లు భారత ప్ర­భు­త్వం ప్ర­క­టిం­చిం­ది. ఇం­డి­య­న్ ఇన్ఫ­ర్మే­ష­న్ అండ్ బ్రాం­డ్ కా­స్టిం­గ్ మి­ని­స్ట­రీ తా­జా­గా ప్ర­క­టిం­చ­డం వి­శే­షం. 71వ జా­తీయ చల­న­చి­త్ర అవా­ర్డుల ప్ర­దా­నో­త్స­వం సం­ద­ర్భం­గా మో­హ­న్ లాల్ కు ఈ అవా­ర్డు­ను ప్ర­క­టిం­చి­న­ట్టు I&B మి­ని­స్ట­రీ వె­ల్ల­డిం­చిం­ది. ఇం­డి­య­న్ ఫి­ల్మ్ ఇం­డ­స్ట్రీ­లో మో­హ­న్ లాల్ సే­వ­ల­ను గు­ర్తిం­చి ఈ అవా­ర్డు­కు ఎం­పిక చే­సి­న­ట్టు ఎక్స్ ద్వా­రా పే­ర్కొం­ది.

ఆ ప్రస్థానం.. అనితర సాధ్యం

మో­హ­న్‌­లా­ల్‌ అసలు పేరు మో­హ­న్‌­లా­ల్‌ వి­శ్వ­నా­థ్‌ నా­య­ర్‌. రెం­డు సా­ర్లు కు­స్తీ పో­టీ­ల్లో ఛాం­పి­య­న్‌­గా ని­లి­చిన లా­లె­ట్ట­న్‌.. ఆరో తర­గ­తి­లో­నే నట­న­లో­కి అడు­గు­పె­ట్టా­రు. ‘తి­ర­నో­ట్ట­మ్‌’ సి­ని­మా­లో మొ­ద­టి­సా­రి నటిం­చా­రు. అయి­తే అది వి­డు­ద­ల­కు నో­చు­కో­లే­దు. ఆ తర్వాత స్నే­హి­తుల బల­వం­తం మీద ఆడి­ష­న్‌­కి వె­ళ్లి ‘మం­జి­ల్‌ వి­రింజ పూ­క్క­ల్‌’లో వి­ల­న్‌ పా­త్ర­కు ఎం­పి­క­య్యా­రు. అది సూ­ప­ర్‌ హి­ట్ట­యి సినీ పరి­శ్ర­మ­లో ని­ల­దొ­క్కు­కో­వ­డా­ని­కి బల­మైన పు­నా­ది వే­సిం­ది. ఆ తర్వాత అం­చె­లం­చె­లు­గా ఎది­గా­రు. 1986లో ఏకం­గా 36 సి­ని­మా­లు చే­శా­రు. అం­దు­కే తనకు రె­స్ట్‌ తీ­సు­కో­వ­డం నచ్చ­ద­ని చె­బు­తా­రు.


ప్రతిభకు నిలువుటద్దం: మోదీ

భా­ర­తీయ చల­న­చి­త్ర రం­గం­లో అత్యు­న్నత పు­ర­స్కా­ర­మైన దా­దా­సా­హె­బ్ ఫా­ల్కే అవా­ర్డు­కు ఎం­పి­కైన ప్ర­ముఖ నటు­డు మో­హ­న్‌­లా­ల్‌­పై ప్ర­ధా­న­మం­త్రి నరేం­ద్ర మోదీ ప్ర­శం­సల వర్షం కు­రి­పిం­చా­రు. ఆయ­న­ను అభి­నం­ది­స్తూ, మో­హ­న్‌­లా­ల్ ప్ర­తి­భ­కు, నట­న­లో వై­వి­ధ్యా­ని­కి ని­లు­వు­ట­ద్దం అని కొ­ని­యా­డా­రు. ఈ సం­ద­ర్భం­గా ప్ర­ధా­ని మా­ట్లా­డు­తూ, దశా­బ్దా­లు­గా సా­గిన మో­హ­న్‌­లా­ల్ కళా ప్ర­స్థా­నం ఎంతో ప్ర­త్యే­క­మై­న­ద­ని అన్నా­రు. మల­యాళ సి­ని­మా, నా­ట­క­రం­గం­లో ఆయన ఒక ప్ర­ముఖ వ్య­క్తి­గా ని­లి­చా­ర­ని ప్ర­ధా­ని పే­ర్కొ­న్నా­రు. మల­యా­ళా­ని­కే పరి­మి­తం కా­కుం­డా తె­లు­గు, తమి­ళం, కన్నడ, హిం­దీ చి­త్రా­ల్లో కూడా అత్యు­త్తమ నట­న­ను ప్ర­ద­ర్శిం­చా­ర­ని గు­ర్తు­చే­శా­రు.

రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అభినందనలు..

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం మోహన్ లాల్ ను అభినందించారు. ” కేరళలోని అందమైన ఆదిపోలి భూమి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల వరకు, ఆయన చేసిన కృషి మన సంస్కృతిని జరుపుకుంది. అలాగే ఆకాంక్షలను పెంచింది. ఆయన వారసత్వం భారతదేశం సృజనాత్మక స్ఫూర్తిని ప్రేరేపిస్తూనే ఉంటుంది.” అంటూ ట్వీట్ చేశారు.

అద్భుత గౌరవం: పవన్ కల్యాణ్

ఈ నే­ప­థ్యం­లో దా­సా­హె­బ్ ఫా­ల్కే అవా­ర్డు­కు మో­హ­న్‌­లా­ల్‌‌ ఎం­పి­క­వ­డం­పై సినీ, రా­జ­కీయ రం­గా­ల­కు చెం­దిన పలు­వు­రు ప్ర­ము­ఖు­లు అభి­నం­ద­న­లు తె­లు­పు­తు­న్నా­రు. ఈ క్ర­మం­లో మో­హ­న్‌­లా­ల్‌­‌­‌­కు ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్ర ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కల్యా­ణ్ అభి­నం­ద­న­లు తె­లి­పా­రు. ఈ మే­ర­కు సో­ష­ల్ మీ­డి­యా మా­ధ్య­మం ఎక్స్ వే­ది­క­గా ట్వీ­ట్ పె­ట్టా­రు పవన్ కల్యా­ణ్.

Tags:    

Similar News