Ajith Kumar : అజిత్ మూవీలో మోహన్ లాల్..?

Update: 2025-06-21 08:45 GMT

ఓ వైపు హీరోగా అఖండ విజయాలు సాదిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆకట్టుకుంటున్నాడు మోహన్ లాల్. కంప్లీట్ యాక్టర్ గా దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్డమ్ ఉన్న మోహన్ లాల్ ఆ మధ్య తమిళ్ లో రజినీకాంత్ జైలర్ లో చేసిన గెస్ట్ రోల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం జైలర్ 2లోనూ ఆ పాత్రను కొనసాగించబోతున్నారు. అలాగే తెలుగులో కన్నప్పలోనూ ఓ గెస్ట్ రోల్ చేశాడు. రీసెంట్ గా మళయాలంలో తుడరుమ్ అనే సినిమాతో ఏకంగా 200 కోట్లు కొల్లగొట్టాడు. అలాంటి మోహన్ లాల్ త్వరలోనే అజిత్ కుమార్ సినిమాలోనూ నటించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతున్న అజిత్ ఈ యేడాది వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీతో ఫామ్ లోకి వచ్చాడు. ఈ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్. అతనితోనే తన నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు అజిత్ కుమార్. మామూలుగా అజిత్ కు నచ్చి హిట్ కూడా పడితే ఆ దర్శకుడిని మూడు నాలుగు సినిమాల వరకూ కంటిన్యూ చేస్తున్నాడీ మధ్య. అందుకే ఆధిక్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ‘ఏకే 64’అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలోనే అత్యంత కీలకమైన పాత్ర కసం మోహన్ లాల్ ను సంప్రదించారట. అతనికి కథతో పాటు ఆయన పాత్ర కూడా వివరించారట. మోహన్ లాల్ కు నచ్చిందని కూడా చెబుతున్నారు. అన్నీ సెట్ అయితే.. త్వరలోనే అజిత్ మూవీలో మోహన్ లాల్ అనే అఫీషియల్ అనౌన్స్ వస్తుంది.

Tags:    

Similar News