Thammudu Movie : తమ్ముడూ.. మూడ్ అదిరిపోయింది

Update: 2025-05-12 12:15 GMT

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అంటూ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేశారు. ఈ చిత్రంలోని ఇంపార్టెంట్ పాత్రలని, కారెక్టర్ నేమ్స్‌ను రివీల్ చేస్తూ వదిలిన ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

‘మూడ్ ఆఫ్ తమ్ముడు’విషయానికి వస్తే ఇందులో సప్తమి గౌడ రత్న అనే పాత్రలో, స్వసిక గుత్తి అనే కారెక్టర్‌లో కనిపించబోతోన్నారు. ఇక సౌరభ్ సచ్ దేవ్ అగర్వాల్ పాత్రను పోషిస్తున్నారు. చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ కనిపించబోతోన్నారు. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అంటూ ఒక్కొక్కరి పాత్ర ఎలా ఉంటుందో హింట్ ఇచ్చారు. కథను కూడా కాస్త రివీల్ చేసినట్టు అనిపిస్తోంది. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ చివర్లో నితిన్ ఎంట్రీ, బాణం వదిలిన తీరు అద్భుతంగా ఉంది.

‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ కోసం అజనీష్ లోకనాథ్ ఇచ్చిన ఆర్ఆర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్‌లో అజనీష్ తన బీజీఎంతో ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేశాడు. కేవీ గుహన్ విజువల్స్, కెమెరా వర్క్ కూడా ఎలా ఉండబోతోందో ఈ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ చూపించేస్తోంది. మొత్తానికి శ్రీరామ్ వేణు మాత్రం ఈ సారి తెరపై మ్యాజిక్ చేయబోతోన్నాడని ఈ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ చెప్పకనే చెబుతోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా.. దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో "తమ్ముడు" సినిమా వస్తుండటం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ తో ఒక్కసారిగా మరింత హైప్ క్రియేట్ చేశారు.

Tags:    

Similar News