మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకుడు. ప్రేక్షకులకు వినోదం అందించేందుకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఆగస్ట్ 14న జరగనున్నాయి.
తాజాగా ఈ సినిమా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఫస్ట్ సింగిల్
సితార్ ను విడుదల చేశారు. ఈ పాట క్లాసికల్, లవ్లీ కంపోజిషన్, బ్యూటీఫుల్ లోకేషన్స్, రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ మధ్య రొమాన్స్ తో అలరించింది. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ తర్వాత మిక్కీ జె మేయర్.. మిస్టర్ బచ్చన్ కోసం హరీష్ శంకర్ తో మళ్లీ జతకట్టారు.
నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ మూవీలో జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.