విట్టిదండు అనే మరాఠీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ మృణాల్ రాకూర్. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ అమ్మడు. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ మ్యాన్ సినిమాల్లోనూ నటించింది. కల్కి 2898 లోనూ కనిపించిందీ అమ్మడు. అందం, అభినయం, నటనలో మృణాల్ మంచి పేరు సంపాదించుకుంది. మృణాల్ ఠాకూర్ అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ లుక్ తో అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా మృణాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆకట్టుకుంటోన్న ఫొటోలు పంచుకుంది. ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన మృణాల్ ను చూసిన నెటిజెన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీనికి ‘క్లాసిక్ చార్మ్ విత్ ఏ దేశీ ట్విస్ట్' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడీ ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ అమ్మడిని చూసిన అభిమానులు కామెంట్లతో ఆమెను సంబురపరుస్తున్నారు.