సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించి.. 'సీతారామం'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఫస్ట్మూవీతోనే మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు 'హాయ్ నాన్న’తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. రెగ్యులర్ సినిమాల్ గా కాకుండా హీరోయిన్ గా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే కథలనే సెలెక్ట్ చేసుకుంటుంది. దీంతో తెలుగు, హిందీ భాషల్లో మృణాల్ కి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఐతే హ్యాట్రిక్ హిట్ కోసం ఫ్యామిలీ స్టార్ అంటూ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసింది. కానీ, ఈ సినిమా మాత్రం పరాజయాన్ని చవిచూపించింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు డెకాయిట్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. లవ్ స్టోరీ విత్ యాక్షన్ తో ఈమూవీని రూపొందిస్తు్న్నారు. అడివి శేష్ తో జత కడుతూ వస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అంచనాలను పెంచేసింది. అయితే మృణాల్ చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా డెకాయిట్ మాత్రమే. అందుకే ఈ అమ్మడు ఆశలన్నీ దానిమీదనే పెట్టుకుంది. ఇది హిట్ అయితేనే ఈబ్యూటీకి మళ్లీ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. కాగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న రిలీజ్ కానుంది.