Saif Alikhan : సైఫ్ అలీఖాన్ పై మర్డర్ అటెంప్ట్

Update: 2025-01-16 04:15 GMT

దేవర విలన్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పై ఆయన ఇంట్లోనే దారుణమైన దాడి జరిగింది. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో ఎవరో దుండగుడు ఆయన ఇంట్లోకి చొరబడటంతో.. అతన్ని వ్యతిరేకించే క్రమంలోనే ఈ దాడి జరిగిందని చెబుతున్నారు. దాడి జరిగిన వెంటనే సైఫ్ ను ముంబైలోని లీలావతి హాస్పిటల్ కు తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. సైఫ్ కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. రెండు చోట్ల తీవ్రమైన కత్తి గాయాలు అయ్యాయి. పొత్తికడుపుకు దగ్గరలో ఒకటి, మెడపై ఒకటి కత్తి పోట్లు ఉన్నాయి. ఈ రెండూ ప్రమాదకరంగా ఉంటాయని భావించినా.. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీస్ లు. నిజానికి సైఫ్ ఇల్లు అత్యంత పటిష్ట భద్రత మధ్యే ఉంటుంది. అయినా అర్థరాత్రి దొంగలు పడ్డారు అనే మాట చాలామందికి నమ్మకాన్ని కలిగించడం లేదు. ఇంట్లో వాళ్లు లేదా బాగా తెలిసిన వారు మాత్రమే చేసే అవకాశం ఉందని పోలీస్ లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.అలాగే దొంగలు వచ్చే అవకాశాలూ లేకపోలేదని ఆ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు.

సైఫ్ అలీఖాన్ గతేడాది ఎన్టీఆర్ నటించిన దేవర 1 తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఫస్ట్ మూవీతోనే తెలుగులో తనదైన ఇంపాక్ట్ చూపించాడు. ఒకప్పుడు లవర్ బాయ్ గా హీరోగా బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సైఫ్. ఏదేమైనా ఈ మధ్య 'బాలీవుడ్ ఖాన్స్' కు బాగా

బెదిరింపులు పెరుగుతున్నాయి. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ ను చంపేస్తా అని ఒకడు ఓపెన్ గా చెబుతున్నాడు. ఇప్పుడు సడీ చప్పుడు లేకుండా సైఫ్ పై అటాక్ జరగడం బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. 

Tags:    

Similar News