Naga Chaitanya: 'నేను ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి తనే కారణం': నాగచైతన్య
Naga Chaitanya: ‘లాల్ సింగ్ చడ్డా’లో నటించడానికి ఒక వ్యక్తి కారణమని చైతూ ఇటీవల బయటపెట్టాడు.;
Naga Chaitanya (tv5news.in)
Naga Chaitanya: టాలీవుడ్‌లో మెల్లమెల్లగా ఇతర హీరోలకు పోటీ ఇస్తున్న బిజీ యక్టర్ అయిపోతున్నాడు నాగచైతన్య. కెరీర్ మొదటితో పోల్చుకుంటే ప్రస్తుతం చై.. తన స్క్రిప్ట్ సెలక్షన్‌లో, యాక్టింగ్‌లో చాలా ఇంప్రూవ్ అయ్యాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అందుకే తనే కావాలని ఏరికోరి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్.. చైతూను తాను నటిస్తున్న 'లాల్ సింగ్ చడ్డా'లో తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి ఒక వ్యక్తి కారణమని చైతూ ఇటీవల బయటపెట్టాడు.
అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ నటిస్తున్న చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం నాగచైతన్యను సంప్రదించగా.. తాను కూడా ఓకే చెప్పాడు. కొద్దిరోజుల్లోనే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసేసుకున్నాడు చైతూ. దాని తర్వాత తన సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు అమీర్.. చైతూకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపాడు.
లాల్ సింగ్ చడ్డా చిత్రం.. ఇంగ్లీష్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన 'ఫారెస్ట్ గ్రంప్' సినిమాకు రీమేక్. అయితే లాల్ సింగ్ చడ్డా చిత్రంలో నటించడానికి చైతూ మాట్లాడుతూ.. ఫారెస్ట్ గ్రంప్ సినిమా తనకు చాలా ఇష్టమని, దాని రీమేక్‌లో నటించే అవకాశం వచ్చినందుకు తాను చాలా హ్యపీగా ఫీల్ అవుతున్నానని అన్నాడు. తాను ఎప్పుడు దీని రీమేక్‌లో భాగమవుతానని అనుకోలేదని తెలిపాడు.
లాల్ సింగ్ చడ్డాలో నటించడానికి ముఖ్య కారణం అమీర్ ఖాన్ అన్న విషయాన్ని బయటపెట్టాడు నాగచైతన్య. అమీర్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని, తన నుండి నేర్చుకునే అవకాశాన్ని చైతూ వదులుకోవాలని అనుకోలేదని తెలిపాడు. అమీర్ సెట్‌లో చాలా ఫన్నీగా ఉంటాడు అన్నాడు చై. పైగా ఇది తనకు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అన్నాడు.