Naga Chaitanya: విడాకుల తర్వాత చైతూ ఈ బిజినెస్‌లోకి దిగిపోయాడా..?
Naga Chaitanya: కేవలం తెలుగు సెలబ్రిటీలే కాదు.. చాలా సినీ పరిశ్రమల సెలబ్రిటీలు ఫుడ్ బిజినెస్‌లో రాణిస్తున్నారు.;
Naga Chaitanya: నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు. నాగచైతన్య కూడా ప్రస్తుతం కెరీర్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇటీవల 'బంగార్రాజు' హిట్‌తో ఫుల్ ఫార్మ్‌లో ఉన్న చైతూ.. చకచకా తన అప్‌కమింగ్ సినిమా షూటింగ్స్‌ను పూర్తిచేసే పనిలో పడ్డాడు. తాజాగా చైతూ ఓ కొత్త బిజనెస్‌లోకి కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తోంది.
కేవలం తెలుగు సెలబ్రిటీలే కాదు.. చాలా సినీ పరిశ్రమల సెలబ్రిటీలు ఫుడ్ బిజినెస్‌లో రాణిస్తున్నారు. రెస్టారెంట్లు, బార్స్ లాంటివి పెట్టి.. ఇటు సినిమాల వల్ల.. అటు బిజినెస్ వల్ల రెండు చేతులా సంపాదిస్తున్నారు. అదే బిజినెస్‌లోకి ప్రస్తుతం చైతూ కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నుండి ఎవరు ఫుడ్ బిజినెస్‌లోకి వెళ్లలేదు. కానీ చైతూ మాత్రం ఈ ప్రయోగానికి సిద్ధమయ్యాడు.
నాగచైతన్య తన ఫుడ్ బిజినెస్ గురించి ఎక్కడా బయటపడనివ్వలేదు. యూకే హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పెట్టిన ఓ ట్వీట్ ద్వారా ఈ విషయం బయటికి వచ్చింది. 'షోయూ' పేరుతో ఓ ప్యాన్ ఏషియన్ డెలివరీ బ్రాండ్ రెస్టారెంటును ప్రారంభించినట్టుగా ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. చైతూ, తన స్నేహితుడు వరుణ్ త్రిపురనేనితో కలిసి ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది.
I've been trying the Cafe scene of #Hyderabad but tonight I tried Shoyu, a new Pan Asian delivery brand founded by my friend @tvaroon & another friends son @chay_akkineni.
— Dr Andrew Fleming (@Andrew007Uk) February 3, 2022
My order for 2 will feed me a week. Very impressive with the the caprise chilled & other dishes piping hot. pic.twitter.com/ThOXORX1Ow