Naga Chaitanya : మరో లగ్జరీ కారును కొనుగోలు చేసిన నాగచైతన్య

Update: 2024-05-22 05:11 GMT

నటుడు నాగచైతన్య తాజాగా పోర్షే 911 జీటీ3ఆర్ఎస్‌ కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ.3.5 కోట్లని సమాచారం. కారు పక్కన చైతూ ఉన్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అత్యంత ఖరీదైన పలు లగ్జరీ కార్లు ఆయన సొంతం. వాటిలో రూ.4 కోట్లకు పైబడిన లంబోర్గినీ, ఫెరారీ, ల్యాండ్ రోవర్ తదితర సంస్థల కార్లున్నాయి. కాగా.. చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్‌లో ‘తండేల్’లో నటిస్తున్నారు.

అక్కినేని వారసుడిగా జోష్ సినిమాతో గ్రాండ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య . తర్వాత ఏమాయ చేశావే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు తనలోని నటుడిని మెరుగుపరుచుకుంటూ కెరీర్లో బిజీగా ఉన్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నాడు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చైతూ దూరంగా ఉంటాడు. బయట కూడా చాలా కూల్ గా, కామ్ గా కనిపిస్తాడు. సినిమా ఫంక్షన్స్ లో కూడా ఎక్కువగా కనిపించరు. కేవలం సినిమాలతో మాత్రమే ఆడియన్స్ ముందుకు వస్తుంటాడు చైతూ.

Tags:    

Similar News