Naga Chaitanya: హారర్ సినిమాలంటే నాకు భయం.. కానీ..: నాగచైతన్య
Naga Chaitanya: నాగచైతన్య కూడా తన కెరీర్‌లో మొదటిసారి హారర్ జోనర్‌ను టచ్ చేయనున్నాడు. అది కూడా తన డిజిటల్ డెబ్యూలోనే.;
Naga Chaitanya: నటీనటులంటే అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ ఉండాలి.. అన్ని రకాల పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలి. ఏ జోనర్ నచ్చలేదు అనడానికి కానీ, ఆ పాత్రలో నేను కనిపించను అనడానికి కానీ వారికి ఆస్కారం ఉండదు. ఒకవేళ అలా చేస్తే వారి కెరీరే రిస్క్‌లో పడుతుంది. అందుకే నాగచైతన్య మొదటిసారి తనకు భయమేసే జోనర్‌ను ప్రయత్నించనున్నాడు.
హారర్ సినిమాలంటే భయం ఉన్నా.. అవి చూస్తే థ్రిల్లింగ్‌గా ఉంటుంది అని భావించే ప్రేక్షకులు చాలామంది ఉంటారు. అందుకే హారర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువ. అంతే కాకుండా ఆ జోనర్ సినిమాలు చాలావరకు మినిమమ్ గ్యారెంటీ హిట్‌గా నిలుస్తాయి. అయితే నాగచైతన్య కూడా తన కెరీర్‌లో మొదటిసారి హారర్ జోనర్‌ను టచ్ చేయనున్నాడు. అది కూడా తన డిజిటల్ డెబ్యూలోనే.
#DhoothaOnPrime: In this supernatural horror, possessed inanimate objects wreak havoc on the lives of people who commit deadly sins.#PrimeVideoPresentsIndia #SeeWhereItTakesYou pic.twitter.com/7lNDbdpTER
— amazon prime video IN (@PrimeVideoIN) April 28, 2022
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న వెబ్ సిరీస్ 'దూత'. అయితే ఇదొక థ్రిల్లర్ సిరీస్‌తో పాటు దీంట్లో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ గురించి మొదటిసారి స్పందించిన నాగచైతన్య తనకు హారర్ జోనర్ అంటే భయమన్న విషయాన్ని బయటపెట్టాడు. కానీ దూతలో నటించడాన్ని తానొక ఛాలెంజ్‌గా తీసుకుంటున్నట్టు తెలిపాడు చైతూ. ఇక ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.
the stellar cast of #DhoothaOnPrime 💙#PrimeVideoPresentsIndia #SeeWhereItTakesYou pic.twitter.com/Ez9XdjQRd9
— amazon prime video IN (@PrimeVideoIN) April 28, 2022