అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో రూపొందబోతోన్న ఈ మూవీ షూటింగ్ మొదలైంది అని తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది టీమ్. ఈ వీడియో చూస్తుంటేనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. తండేల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. బట్ ఈ వీడియో చూస్తే ఇప్పటి వరకూ ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ చాలా చిన్నవి అన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఆ రేంజ్ లో ఉంది వీరి మేకింగ్ వీడియో. ఏళ్ల తరబడిన వర్క్, నెలల తరబడిన ప్లానింగ్, అంతులేని గంటల రిహార్సల్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం అని చెబుతూ విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియోనే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఇంతకు ముందెప్పుడూ చూడని ఓ ‘మిథికల్ థ్రిల్లర్’కోసం రెడీగా ఉండండి అంటూ హింట్ ఇచ్చారు. అలాగే షూటింగ్ స్టార్ట్ అయింది అని కాకుండా తవ్వకాలు మొదలయ్యాయి అని చెప్పడం చూస్తే ఇది ఓ నిధి వేటకు సంబంధించిన కథ అని కూడా అర్థం చేసుకోవచ్చు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ఇది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. స్క్రీన్ ప్లే సుకుమార్ అందించడం విశేషం. హిట్ మెషీన్ అనిపించుకున్న అజనీష్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నాడు. నీల్ డి కుంచా సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఇక హీరోయిన్ కు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ.. వీళ్లు ఈ వీడియలో ఎవరి పేరూ చెప్పలేదు. అలాగే ఇతర కాస్టింగ్ గురించిన న్యూస్ కూడా లేదు. ఏదేమైనా నాగ చైతన్య నెవర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలాంటి మూవీతో వస్తున్నాడు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది.