Naga Vamsi : ఎన్టీఆర్ కు పోటీగా నాగవంశీ మరో పౌరాణికం

Update: 2025-09-10 10:03 GMT

ఈ మధ్య పౌరాణికాలకు మళ్లీ ఊపు వచ్చింది. అన్ని భాషల్లోనూ మన పౌరాణికాలపై కొత్త కొత్త సినిమాలు తయారవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది కాబట్టి.. వాటి ద్వారా మరింత మంచి ఎక్స్ పీరియన్స్ ను అందించే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు వక్రీకరణలు కూడా చేస్తున్నారు. బట్ జెన్యూన్ గా ప్రయత్నించిన మహావతార్ ఉగ్రసింహా వంటి యానిమేషన్ మూవీ వందల కోట్లు కొల్లగొట్టి సత్తా చాటింది. బాలీవుడ్ లో ప్రస్తుతం రామాయణం తెరకెక్కుతోంది. ఇటు తెలుగులో కూడా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ పౌరాణిక సినిమా రాబోతోంది. హారిక హాసిని బ్యానర్ లో ఈ చిత్రం రూపొందబోతోంది. అయితే ఎన్టీఆర్ కంటే ముందే సితార బ్యానర్ లో నాగవంశీ ఓ కొత్త పౌరాణిక సినిమా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. అంటే తమ బ్యానర్స్ లో బ్యాక్ టు బ్యాక్ పౌరాణిక సినిమాలు వస్తున్నాయి.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో వాయుపుత్ర అనే సినిమా అనౌన్స్ చేశాడు. చందు ఇదే బ్యానర్ లో గతంలో ప్రేమమ్ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మళయాల రీమేక్ అయిన ఈ మూవీ ఇక్కడా పెద్ద విజయం సాధించింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సితారలో వాయుపుత్రుడి కథను రూపొందించబోతున్నాడు. వాయు పుత్రుడు అంటే హనుమంతుడే కదా. ఆల్రెడీ హను మాన్ అనే సోషియో ఫాంటసీ వచ్చింది. అందుకే వీళ్లు ఈ చిత్రాన్ని ‘త్రీడీ యానిమేషన్’లో రూపొందించబోతున్నారు. అంటే మహావతార్ లాగా అన్నమాట. మహావతార్ కోసం ఆ దర్శకుడు ఏకంగా నాలుగేళ్లు టైమ్ తీసుకున్నాడు. మరి చందూ మొండేటి ఎంత టైమ్ తీసుకుంటాడో కానీ.. ఎన్టీఆర్ పౌరాణికం కంటే ముందే నాగవంశీ ఇలా యానిమేషన్ మూవీతో రావాలనుకోవడం యాధృచ్ఛికమేనా.. లేక ముందే ప్లాన్ చేసుకున్నారా..

Tags:    

Similar News