Naga Vamsi : దేవర డిస్ట్రిబ్యూటర్స్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన నాగవంశీ

Update: 2024-10-18 11:58 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన దేవర బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 500 కోట్ల క్లబ్ లో చేరి ఎన్టీఆర్ సత్తాను సోలోగానే ప్రపంచానికి చూపించింది. దేవర డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ భారీ లాభాలు తెచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద విజయం సాధించిన స్టార్ హీరో మూవీ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత నాగవంశీ .. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ దుబాయ్ లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు.

ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల నుంచి అందరు డిస్ట్రిబ్యూటర్స్ ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. అలాగే దేవరకు సంబంధించి తమ అనుభవాలను ఒక్కొక్కరుగా పంచుకున్నారు. దేవర మిడ్ నైట్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం.. వీకెండ్ అవగానే గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే కావడం.. ఆ వెంటనే దసరా హాలిడేస్ యాడ్ అవడంతో దేవర దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. సినిమా విడుదలై 20 రోజులవుతున్నా.. ఇంకా థియేటర్స్ లో దేవర దూకుడు తగ్గలేదు.

రిలీజ్ కు ముందు కొరటాల శివ కారణంగానూ, రాజమౌళి సెంటిమెంట్స్ తోనూ రకరకాల కామెంట్స్ వచ్చినా.. అన్నిటినీ దాటుకుని బాక్సాఫీస్ బద్దలయ్యే విజయాన్ని అందుకున్న దేవర డిస్ట్రిబ్యూటర్స్ లో గొప్ప ఆనందాన్ని నింపింది. ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ నాగవంశీ ఏకంగా దుబాయ్ లో పార్టీ ఇవ్వడం టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది. అలాంటి విజయాలకు ఇలాంటి పార్టీలు తోడైతే ఇండస్ట్రీలో మరింత సుహృద్భావ వాతావరణం ఉంటుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది.  

Tags:    

Similar News