మళయాల సినిమాల్లో బలమైన కంటెంట్ ను చూస్తూ వస్తున్నాం. కొన్నాళ్ల క్రితం మిన్నల్ మురళి అనే సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీతో ఆకట్టుకున్న మాలీవుడ్ నుంచి తాజాగా మరో సూపర్ విమెన్ స్టోరీ వచ్చింది. ‘లోకా చాప్టర్ 1 చంద్ర’ అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రాన్ని డోమినిక్ అరుణ్ డైరెక్ట్ చేశాడు. కళ్యాణి ప్రియదర్శి మెయిన్ లీడ్ లో నాస్లేన్, శాండీ, అరుణ్ కురియన్, విజయరాఘవన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కొత్త లోకా’ అనే టైటిల్ తో సితార బ్యానర్ అధినేత నాగవంశీ విడుదల చేశాడు.
నిర్మాతగా సూపర్ హిట్ మూవీస్ అందిస్తూనే డిస్ట్రిబ్యూటర్ గానూ ఇతర భాషల్లో రూపొందుతోన్న మంచి సినిమాలను తెలుగులో అందిస్తూ ఆకట్టుకుంటున్నాడు నాగవంశీ. ఆ మధ్య తెలుగులోనే నిర్మితమైన దేవరను డిస్ట్రిబ్యూట్ చేసి పెద్ద విజయం అందుకున్నాడు. రీసెంట్ గా వార్ 2 ను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బట్ కొత్త లోకాతో మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే టాక్ అందుకున్నాడు. నాగవంశీ అంచనాలు మాగ్జిమం తప్పవు అని కొత్త లోకా నిరూపించబోతోంది అంటున్నారు. ఓ అద్భుతమైన కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ శుక్రవారమే విడుదలైన ఈ చిత్రానికి అన్ని భాషల నుంచి బ్లాక్ బస్టర్ రివ్యూస్ వచ్చాయి. తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదలైనా రిజల్ట్ మాత్రం మారలేదు. ఇక్కడా సూపర్ హిట్ గ్యారెంటీ అనిపించుకుంటోంది. ఇక ఈ మూవీతో నాగవంశీ డిస్ట్రిబ్యూటర్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్టే అని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే యేడాదికి కనీసం రెండు సినిమాలైనా తన బ్యానర్ నుంచి రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్ గానూ సత్తా చాటుతూ ఇండస్ట్రీకి అత్యంత కీలకమైన వ్యక్తిగా మారాడు నాగవంశీ. చాలా యాక్టివ్ ప్రొడ్యూసర్ గా తనదైన మార్క్ ను వేస్తూ వస్తున్న నాగవంశీకి కొత్త లోకా సరికొత్త ఇమేజ్ తెస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.