Nagarjuna Akkineni : ఈ షర్ట్ ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!
వైరల్ అవుతోన్న నాగార్జున ధరించిన లూయిస్ విట్టన్ స్వెట్‌షర్ట్.. ధర చూసి షాకవుతున్న నెటిజన్లు;
అక్కినేని నాగార్జున రావు భారతదేశంలోని ప్రముఖ నటుడు. ప్రధానంగా తెలుగు చిత్రాలకు ప్రసిద్ధి అన్న విషయం చాలా మందికి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రానికి 'నా సామి రంగ' అనే టైటిల్‌తో సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఆయనకు విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితం గురించి ఆయన తన అభిమానులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాడు.
సినిమాలలో తన నటనతో పాటు, నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన ఫ్యాషన్ సెన్స్‌కు కూడా ప్రసిద్ది చెందారు. విలాసవంతమైన, దృష్టిని ఆకర్షించే దుస్తులను ధరించడంతో ఆయన తరచుగా హైలెట్ కావడం చాలా మందికి తెలిసిన విషయమే. దీంతో అతను సినీ పరిశ్రమలో స్టైల్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున ఇటీవల లూయిస్ విట్టన్ స్వెట్‌షర్ట్ ధరించి కనిపించాడు. అయితే ఇది భారీ ధర ట్యాగ్ కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అవును, ఇది నిజానికి లూయిస్ విట్టన్ నుండి వచ్చిన 'ఇంటార్సియా కాష్మెరె వూల్ క్రూనెక్' స్వెట్‌షర్ట్. దీని ధర మీకు నిజంగానే షాక్ ఇస్తుంది.
నాగార్జున ఖరీదైన లూయిస్ విట్టన్ స్వెట్‌షర్ట్ ధరించిన చిత్రాన్ని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ 'సెలబ్రిటీస్ అవుట్‌ఫిట్ డీకోడ్' వారి అధికారిక ఖాతాలో షేర్ చేసింది. ఈ స్వెట్ షర్ట్ ధర రూ. 1.82లక్షలు అని పేర్కొంది. స్వెట్‌షర్ట్ స్వచ్ఛమైన కాశ్మీరీ ఉన్నితో తయారు చేసినట్లు తెలుస్తోంది. బ్రాండ్ నాణ్యతను పరిగణనలోకి తీసుకుంటే, ఇది చాలా సాధారణ ధర. లూయిస్ విట్టన్ అనేది ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్. ఈ బ్రాండ్ దుస్తులను చాలా మంది భారతీయ ప్రముఖులు ధరించడం కొత్తేం కాదు.
బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున ఈ సీజన్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. హోస్ట్‌గా నాగార్జునపై విమర్శలు వచ్చాయి. అయితే సీజన్ 7లో ఉల్టా పుల్టా అంటూ మంచి హైప్ ఇచ్చారు నాగార్జున. గతంలో కంటే భిన్నంగా.. గేమ్‌లో ఇన్వాల్వ్ అవుతూ హోస్ట్‌గా మెప్పిస్తున్నారు నాగ్. అయితే ఫ్యాన్స్ వార్ మధ్య హోస్ట్ బలి కావడం.. బూతులు తినడం ఎప్పుడూ ఉండేదే కానీ.. ఈ సీజన్‌లో మాత్రం నాగార్జున హోస్టింగ్‌కి మంచి మార్కులే పడుతున్నాయి.