The Ghost : ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతం పెంచుతున్న 'ద ఘోస్ట్' పోస్టర్..
The Ghost : అక్కినేని నాగార్జున్ యాక్షన్ మూవీ 'ద ఘోస్ట్'కు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.;
The Ghost : అక్కినేని నాగార్జున్ అప్‌కమింగ్ యాక్షన్ మూవీ 'ద ఘోస్ట్'కు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటర్‌పోల్ డ్రెస్‌లో జీప్ పైన కూర్చున్న సోనల్ చౌహాన్, నిలబడ్డ నాగార్జున పిక్.. ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచాయి. ఈ మూవీకి సంబంధించిన మరో కీలకమైన అప్డేట్‌ను కూడా ఇచ్చారు మేకర్స్.
'అక్టోబర్ 5న కిల్లింగ్ మెషిన్ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లలో కలుద్దాం' అని ఘోస్ట్ మూవీ కొత్త ఫోటోను ట్యాగ్ చేశారు. ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. భరత్ సౌరభ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ద ఘోస్ట్ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ గ్లింప్స్ రిలీజ్ కాగా తాజాగా నాగార్జున, సోనల్ కలిసి ఉన్న ఫోటోను విడుదల చేశారు.