The Ghost Trailer : ' ద ఘోస్ట్' ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ ప్లస్ థ్రిల్లింగ్..
The Ghost Trailer : అక్కినేని నాగార్జున్, సోనాల్ చౌహాన్ కలిసి నటించిన ‘ద ఘోస్ట్’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.;
The Ghost Trailer : అక్కినేని నాగార్జున్, సోనాల్ చౌహాన్ కలిసి నటించిన 'ద ఘోస్ట్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్‌ను లైగర్ సినిమా ఇంటర్వెల్‌లో ప్లే చేశారు. ప్రిన్స్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్‌పోల్ అధికారిగా నాగార్జున, సోనల్ చౌహాన్ నటించారు. ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్‌లో మనకు అక్కినేని నాగార్జున కనిపించనున్నారు. భరత్ సౌరభ్ అందించిన సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది.